Telangana: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, డీకే అరుణ, షబ్బీర్ అలీ ఘోర పరాజయం!

  • 16వేల ఓట్ల తేడాతో కోమటిరెడ్డి చిత్తు
  • గంప గోవర్ధన్ చేతిలో షబ్బీర్ అలీ ఓటమి
  • మూడు స్థానాల్లో గెలిచిన మజ్లిస్ పార్టీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్లగొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి 16,500 ఓట్ల మెజారిటీతో కోమటిరెడ్డిపై ఘనవిజయం సాధించారు. మరోవైపు గద్వాలలో కాంగ్రెస్ నేత డీకే అరుణ సైతం ఓటమి చవిచూశారు. కామారెడ్డిలో టీఆర్ఎస్ నేత గంప గోవర్ధన్ చేతిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పరాజయం పాలయ్యారు.

మరోవైపు కూకట్ పల్లిలో మాధవరం కృష్ణారావు 28,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. కాగా, ఏఐఎంఐఎం పార్టీ తాజాగా మరో రెండు స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. చార్మినార్ నుంచి ఏఐఎంఐఎం అభ్యర్థి అహ్మద్ ఖాన్ 32,317 మెజారిటీతో, బహదూర్ పురాలో మౌజంఖాన్ తమ సమీప ప్రత్యర్థులపై ఘనవిజయం సాధించారు. కాగా, మజ్లిస్ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణ గుట్ట నుంచి ఇప్పటికే 54 వేల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

Telangana
Telangana Assembly Results
KOAMTI REDDY
dk aruna
sahbbir ali
lost
TRS
Mahakutami
AIMIM
  • Loading...

More Telugu News