Telangana: టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ.. ఘోరంగా ఓడిపోయిన మంత్రులు తుమ్మల, జూపల్లి, చందూలాల్!

  • పాలేరులో కాంగ్రెస్ నేత ఉపేందర్ రెడ్డి విజయం
  • స్పీకర్ మధుసూదనాచారికి తప్పని ఓటమి
  • రాష్ట్రమంతటా కొనసాగుతున్న కౌంటింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకుపోతున్న టీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి  పోటీ చేసిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ నేత, ప్రజాకూటమి (మహాకూటమి) అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల ఓటమి చవిచూశారు. మరోవైపు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ లో ఘోర పరాజయాన్ని మూటగట్టున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి విజయ దుందుభి మోగించారు. అలాగే ములుగు టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి చందూలాల్, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఓటమి పాలయ్యారు. 

Telangana
Telangana Assembly Results
TRS
Mahakutami
tummala
jupally
lost
  • Loading...

More Telugu News