Telangana: తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్.. చిత్తుగా ఓడిపోయిన జానారెడ్డి!

  • ఘనవిజయం సాధించిన నర్సింహయ్య
  • విజయంపై ఆశలు పెట్టుకున్న జనారెడ్డి
  • 80 స్థానాల్లో ఆధిక్యంలో సాగుతున్న టీఆర్ఎస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తలిగింది. తాజా ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఘోర పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య చేతిలో 9,516 ఓట్ల తేడాతో జనారెడ్డి ఓడిపోయారు. ఈసారి కూడా  నాగార్జునసాగర్ లో జానా కచ్చితంగా గెలుస్తారని భావించినప్పటికీ, నియోజకవర్గం ప్రజలు మాత్రం టీఆర్ఎస్ కే పట్టం కట్టారు.

తెలంగాణ ఎన్నికల్లో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, కంటోన్మెంట్, పరకాల, వర్ధన్న పేట సహా పలుచోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్ ప్రకారం టీఆర్ఎస్ 80, కాంగ్రెస్ పార్టీ 12, బీజేపీ, మజ్లిస్, ఇతరులు రెండు స్థానాలు చొప్పున ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Telangana
Congress
Mahakutami
TRS
Jana Reddy
lost
nomula
narsimhayya
  • Loading...

More Telugu News