kcr: కేటీఆర్... రాబోయే ఐదేళ్లకు ఆల్ ది బెస్ట్: ఒమర్ అబ్దుల్లా
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-b5c089a12261546ca6b446bd31b03dc6be3fa360.jpg)
- క్లీస్ స్వీప్ దిశగా టీఆర్ఎస్
- తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
- కేటీఆర్ ను అభినందించిన ఒమర్ అబ్దుల్లా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఫలితాల రూపంలో వెల్లడవుతోంది. క్లీన్ స్వీప్ దిశగా టీఆర్ఎస్ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'థ్యాంక్స్ తెలంగాణ. కేసీఆర్ గారిపై నమ్మకం ఉంచినందుకు, మీకు మరోసారి సేవ చేసే అవకాశం కల్పించినందుకు' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రిప్లై ఇచ్చారు. 'కంగ్రాచ్యులేషన్స్. రానున్న ఐదేళ్లకు ఆల్ ది బెస్ట్' అంటూ కేటీఆర్ ను అభినందించారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-cd8399743c8ff6331739ba3afbb1547958951fca.jpg)