Telangana: కన్నీటి పర్యంతమైన కొండా సురేఖ.. తనను టార్గెట్ చేయబోతున్నారని ఆవేదన!

  • పరకాలలో ఓడిపోయిన మహాకూటమి నేత
  • ప్రజలు ప్రలోభాలకు లోనయ్యారని వ్యాఖ్య
  • ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి ధర్మారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ ప్రలోభాలకు తెరలేపిందని మహాకూటమి పరకాల అభ్యర్థి, కాంగ్రెస్ నేత కొండా సురేఖ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రలోభాలకు ప్రజలు లొంగిపోయారని వ్యాఖ్యానించారు. ఉద్యోగాల కోసం వేలాది మంది యువత రోడ్డుపైకి వచ్చి పోరాడుతుంటే టీఆర్ఎస్ నేతలు పట్టించుకోలేదనీ, అలాంటివారికే ప్రజలు మరోసారి పట్టం కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేత చల్లా ధర్మారెడ్డి చేతిలో కొండా సురేఖ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని కొండా సురేఖ ఆరోపించారు. తాజాగా ఎన్నికల్లో విజయం నేపథ్యంలో గతంలో టీఆర్ఎస్ అరాచక పాలనకు అడ్డుగా నిలిచిన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డితో పాటు తనను లక్ష్యంగా చేసుకోబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం అనుచరులతో కలిసి కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

Telangana
Telangana Assembly Results
Konda Surekha
Mahakutami
TRS
challa dharma reddy
  • Loading...

More Telugu News