Telangana: సిద్ధిపేటలో దూసుకెళుతున్న కారు..1,06,816 ఓట్ల మెజారిటీలో హరీశ్ రావు!

  • నాలుగు చోట్ల విజయం దక్కించుకున్న కారు
  • 90 స్థానాల్లో మెజారిటీ దిశగా పయనం

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా సిద్ధిపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత హరీశ్ రావు 1,06,816 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.  టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కోరుట్ల, కంటోన్మెంట్, వర్ధన్నపేట, జగిత్యాల నియోజకవర్గాల్లో విజయ దుందుభి మోగించింది. తాజా ఫలితాల మేరకు టీఆర్ఎస్ 90 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 18, బీజేపీ 2, మజ్లిస్ 4, ఇతరులు ఓ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Telangana
Siddipet District
Harish Rao
TRS
Telangana Assembly Results
won
  • Loading...

More Telugu News