Telangana: కోరుట్లలో కారు జోరు.. ఘనవిజయం సాధించిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు!

  • మహాకూటమి అభ్యర్థి జువ్వాడిపై విజయకేతనం
  • 24,898 ఓట్ల మెజారిటీ సాధించిన గులాబీ నేత
  • భారీ లీడ్ దిశగా సాగుతున్న తలసాని శ్రీనివాసయాదవ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎదురులేకుండా దూసుకుపోతుంది. ఇప్పటికే 90కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్, తాజాగా కోరుట్లలో విజయదుందుభి మోగించింది. కోరుట్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి కుల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మహాకూటమి అభ్యర్థి జువ్వాడి నర్సింగరావుపై 24,898 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఇక సనత్ నగర్ లో టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ 18,118 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అలాగే నారాయణ్ ఖేడ్ లో 24 వేల ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ జోరు కొనసాగిస్తోంది.

Telangana
Telangana Assembly Results
korutla
TRS
maha
Mahakutami
  • Loading...

More Telugu News