Telangana: ముషీరాబాద్, ఖైరతాబాద్ లో బీజేపీకి ఎదురుగాలి.. దూసుకుపోతున్న టీఆర్ఎస్!

  • ముషీరాబాద్ లో టీఆర్ఎస్ కు 3 వేల ఆధిక్యం
  • చింతలకు దానం నాగేందర్ ఝులక్
  • మూడు చోట్ల గెలుపొందిన కారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న ముషీరాబాద్ లో ఓటర్లు టీఆర్ఎస్ కు పట్టం కట్టారు. ఇక్కడ మూడో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్  పై 3,559 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.

మరోవైపు ఆదిలాబాద్ లో మాజీ మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న తన సమీప ప్రత్యర్థి పై 6,388 ఓట్ల లీడ్ తో కొనసాగుతున్నారు. బాల్కొండలో టీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి, ఖైరాతాబాద్ లో దానం నాగేందర్ బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై 3,179 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇప్పటివరకూ 3 స్థానాలను దక్కించుకోగా, 92 చోట్ల లీడ్ లో కొనసాగుతోంది.

Telangana
Telangana Assembly Results
mushirabad
khairatabad
TRS
Telugudesam
Mahakutami
  • Loading...

More Telugu News