Telangana: కంటోన్మెంట్ లో గులాబీ జెండా రెపరెపలు.. ఘనవిజయం సాధించిన సాయన్న!

  • 12 వేల మెజారిటీ సాధించిన సాయన్న
  • 92 స్థానాల్లో ఆధిక్యంలో టీఆర్ఎస్
  • మూడు స్థానాలు గెలుచుకున్న కారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ తాజాగా మూడో విజయాన్ని నమోదుచేసింది. ఇక్కడి కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి సర్వే సత్యనారాయణపై టీఆర్ఎస్ నేత సాయన్న ఘనవిజయం సాధించారు.

 తాజా ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న 12,000 ఓట్లపై పైగా మెజారిటీతో విజయదుందుభి మోగించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం 3 స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్ 92 స్థానాల్లో మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. కాగా, చాంద్రాయణ గుట్ట నుంచి మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

Telangana
Telangana Assembly Results
contonment
sayanna
sarye satyanarayana
  • Loading...

More Telugu News