Telangana: ఆందోల్ లో దూసుకువెళుతున్న కారు.. విజయం దిశగా టీఆర్ఎస్ నేత క్రాంతి కిరణ్!

  • ఆందోల్ లో మహాకూటమి తరఫున దామోదర రాజనరసింహ పోటీ
  • నియోజకవర్గంలో 5,335 ఓట్ల లీడ్ లో టీఆర్ఎస్ 
  • సిరిసిల్లలో కేటీఆర్ కు 39,000 ఓట్ల ఆధిక్యం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ విజయం దిశగా సాగుతోంది. తాజా అప్ డేట్ ప్రకారం ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ మహాకూటమి అభ్యర్థి దామోదర రాజనరసింహపై 5,335 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఏకంగా 39,000 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. మరోవైపు చేవెళ్లలో మహాకూటమి అభ్యర్థి ముజఫర్ అలీఖాన్ పై టీఆర్ఎస్ నేత కాలే యాదయ్య 11,000 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. తాజా ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 96 స్థానాల్లో లీడ్ లో ఉండగా, జగిత్యాలను ఇప్పటికే గెలుచుకుంది.

Telangana
Telangana Assembly Results
TRS
andole
kranti kumar
  • Loading...

More Telugu News