TRS: ఇంత హవాలోనూ ఓటమి దారిలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే!

  • ఓటమి బాటలో మంత్రి జగదీశ్ రెడ్డి
  • స్పీకర్ మధుసూదనాచారి, పిడమర్తి రవి కూడా
  • జలగం వెంకట్రావు, ప్రభాకర్ రెడ్డిలదీ అదే దారి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తన సత్తాను చాటుతూ ఘన విజయం దిశగా ఇప్పటికే దూసుకెళ్లగా, కొందరు టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి బాటలో ఉన్నారు. వారిలో సూర్యాపేట నుంచి బరిలోకి దిగిన మంత్రి జీ జగదీశ్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ముందంజలో ఉన్నారు.

ఇదే సమయంలో జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలో తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరఫున పోటీ పడిన పిడమర్తి రవి సైతం వెనుకంజలో ఉండగా, ఇక్కడ టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ఆధిక్యంలో ఉన్నారు.

ఇక కొత్తగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు కన్నా కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఆధిక్యంలో ఉన్నారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ ముందంజలో ఉండగా, టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఓటమి బాటలో ఉన్నారు.

TRS
Telangana
Telangana Election 2018
Telangana Assembly Results
Congress
  • Loading...

More Telugu News