sanant nagar: సనత్ నగర్ లో టీఆర్ఎస్ హవా.. 6,000 ఓట్ల అధిక్యంలో తలసాని శ్రీనివాసయాదవ్!

  • వెనుకపడ్డ కూన వెంకటేశ్ గౌడ్
  • పరకాలలో సురేఖకు ఎదురుగాలి
  • 12 వేల లీడ్ లో చల్లా ధర్మారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. తాజాగా సనత్ నగర్ మహాకూటమి అభ్యర్థి కూన వెంకటేశ్ గౌడ్ పై టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ 6,227 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే పరకాల నియోజకవర్గంలోనూ మహాకూటమి అభ్యర్థి కొండా సురేఖకు ఎదురుగాలి విస్తోంది. మూడో రౌండ్ ముగిసేసరికి చల్లా ధర్మారెడ్డి ఏకంగా 12,457 ఓట్ల లీడ్ తో ముందుకు దూసుకుపోతున్నారు. చొప్పదండి, కోరుట్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీ దిశగా సాగుతున్నారు.

sanant nagar
TRS
Mahakutami
Telangana Assembly Results
6000 votes
talasani
  • Loading...

More Telugu News