Telangana: సైకిల్ ముందు చక్రాన్ని తెలంగాణ ప్రజలు ఊడగొట్టారు.. రెండోదాన్ని వదిలించుకోవడానికి ఏపీ ప్రజలు కసిగా ఉన్నారు!: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు చావుతప్పి కన్నులొట్టపోయింది
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన నేత
  • 90 స్థానాల్లో లీడ్ లో టీఆర్ఎస్

తెలంగాణ ప్రజలు ఇస్తున్న తీర్పుతో టీడీపీ గుర్తు అయిన సైకిల్ ముందు చక్రం ఊడిపోయిందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి చావుతప్పి కన్నులొట్టబోయినంత పని అయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు వదిలేసిన సైకిల్ రెండో చక్రాన్ని కూడా పీకేసి చంద్రబాబు పీడను త్వరగా వదిలించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కసిగా ఎదురు చూస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

కడపటి వార్తలు అందేసరికి అధికార టీఆర్ఎస్ 90 స్థానాల్లో, మహాకూటమి 16, మజ్లిస్ 5, బీజేపీ 3, ఇతరులు 3 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. ఏఐఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ, జగిత్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ ఇప్పటికే విజయం సాధించారు.

Telangana
Telangana Assembly Results
Chandrababu
Vijay Sai Reddy
YSRCP
Telugudesam
Mahakutami
  • Loading...

More Telugu News