TRS: తాచెడ్డ కోతి వనమెల్ల చెడిచింది... పెద్ద నాయుడు కాంగ్రెస్ ను నిండా ముంచేశాడు: విజయసాయిరెడ్డి

  • స్పష్టమైన మెజారిటీ దిశగా టీఆర్ఎస్
  • కేటీఆర్ మంచి విశ్లేషణ చేశారు
  • ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ మొదలైన తరువాత టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీ దిశగా సాగుతుండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్న సామెతను గుర్తు చేస్తూ, ఓ ట్వీట్ ను పెట్టారు. ఇదే సమయంలో తమ విజయావకాశాలపై కేటీఆర్ మంచి విశ్లేషణ చేశారని కితాబిచ్చారు.

"కేటీఆర్ చక్కగా ఎనలైజ్ చేశాడు. మీడియా, డబ్బుతో ఏదైనా చేయొచ్చన్న భ్రమలో ఉంటాడు చంద్రబాబు. ప్రజలు మిమ్మల్ని చూస్తేనే భయపడుతుంటే మీడియా, మీరు నమ్ముకున్న నోట్ల కట్టలు గెలిపించలేవు. తాచెడ్డ కోతి వనమెల్లా చెడిచినట్టు తెలంగాణా కాంగ్రెస్ ను నిండా ముంచుతున్నాడు పెద్ద నాయుడు" అని ట్వీట్ పెట్టారు.



TRS
Vijayasai Reddy
Twitter
Telangana
Telangana Election 2018
Telangana Assembly Election
Telangana Assembly Results
  • Loading...

More Telugu News