Telangana: కొడంగల్ లో రేవంత్ రెడ్డికి షాక్.. జగిత్యాలలో 17,000 లీడ్ లో టీఆర్ఎస్!

  • రేవంత్ పై లీడ్ లో టీఆర్ఎస్ నేత నరేందర్ రెడ్డి
  • జీవన్ రెడ్డిపై భారీ మెజారిటీ దిశగా సంజయ్
  • కంటోన్మెంట్ లో వెనుకబడ్డ సర్వే

కాంగ్రెస్ కంచుకోట కొడంగల్ లో ప్రజలు మహాకూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డికి షాకిచ్చారు. తాజాగా వెల్లడవుతున్న ఫలితాల ప్రకారం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 1,173 ఓట్ల లీడ్ తో దూసుకుపోతున్నారు.

మరోపక్క, జగిత్యాలలోనూ కారు జోరు కొనసాగుతోంది. అక్కడ కౌంటింగ్ నాలుగో రౌండ్ ముగిసేనాటికి టీఆర్ఎస్ అభ్యర్థి డా.సంజయ్ కుమార్, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిపై ఏకంగా 17,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే కంటోన్మెంట్ ప్రాంతంలో టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న మహాకూటమి అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 2,269 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు.

Telangana
Telangana Assembly Results
Revanth Reddy]
Jeevan Reddy
NARENDER REDDY
SANJAY KUMAR
  • Loading...

More Telugu News