Harish Shankar: 11 గంటల దాకానా? పాడా?... ఇప్పుడే తెలిసిపోయింది: దర్శకుడు హరీశ్ శంకర్!

  • అంతసేపు వేచి చూడాల్సిన అవరం లేదు
  • చాలా త్వరగానే ఫలితం తెలిసిపోయింది
  • ప్రజాస్వామ్యం శక్తి ఇదేనన్న హరీశ్ శంకర్

తెలంగాణ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయం 11 నుంచి 11.30 గంటల మధ్య తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, పదకొండున్నర వరకూ వేచి చూడాల్సిన అవసరం లేదని, చాలా త్వరగానే ఫలితం తెలిసిపోయిందని అన్నారు.

"11 నుంచి 11.30 మధ్య క్లారిటీ అన్నారు. చాలా త్వరగానే తెలిసిపోయింది. ప్రజాస్వామ్యం శక్తి ఇదే" అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ప్రస్తుతం టీఆర్ఎస్ 85 స్థానాల్లో లీడ్ లో ఉండగా, కాంగ్రెస్ 17, బీజేపీ 4, ఎంఐఎం 4, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.



Harish Shankar
Telangana
Telangana Election 2018
Telangana Assembly Election
Telangana Assembly Results
  • Loading...

More Telugu News