Telangana: పరకాలలో కొండా సురేఖకు షాక్.. చెన్నూరులో దూసుకుపోతున్న బాల్కసుమన్!

  • పరకాలలో వెనుకబడ్డ సురేఖ
  • మెజారిటీ దిశగా చల్లా ధర్మారెడ్డి
  • చెన్నూరులో సుమన్ కు 3,036 లీడ్

పరకాల నియోజకవర్గం మహాకూటమి అభ్యర్థి, కాంగ్రెస్ నేత కొండా సురేఖకు షాక్ తగిలింది. తాజాగా టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి సురేఖపై 6,000 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. మరోవైపు వరంగల్ తూర్పు టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ మహాకూటమి అభ్యర్థిపై 1,100 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు.

ఇక చెన్నూరులో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ కు సానుకూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. చెన్నూరులో తొలి రౌండ్ ముగిసేటప్పటికీ మహాకూటమి అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ పై బాల్క సుమన్ 3,036 ఓట్ల మెజారిటీతో ముందుకు దూసుకుపోతున్నారు.

Telangana
Telangana Assembly Results
Konda Surekha
balka suman
  • Loading...

More Telugu News