Nandamuri Suhasini: కూకట్ పల్లిలో నందమూరి సుహాసిని వెనుకంజ!

  • ముగిసిన తొలి రౌండ్ కౌంటింగ్
  • కృష్ణారావుకు ఆధిక్యం
  • ఖైరతాబాద్ లో ముందున్న దానం

తెలుగుదేశం పార్టీతో పాటు ప్రజా కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కూకట్ పల్లి నియోజకవర్గంలో దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని వెనుకంజలో ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు తొలి రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి సుమారు 3 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తోంది. ఇక్కడ సుహాసిని గెలుస్తుందని ప్రజా కూటమి గట్టి నమ్మకంతో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, కోల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు, జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ ఆధిక్యంలో ఉన్నారు.

Nandamuri Suhasini
Kukatpalli
First Round
Telangana Election 2018
Telangana Assembly Election
Telangana Assembly Results
Danam Nagender
  • Loading...

More Telugu News