Telangana: రాష్ట్రవ్యాప్తంగా స్ట్రాంగ్ రూములు ఓపెన్.. ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు

  • తెరుచుకున్న స్ట్రాంగ్ రూము తలుపులు
  • ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
  • పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంలను భద్రపరిచిన అన్ని స్ట్రాంగ్‌రూములను అధికారులు తెరిచారు. రంగారెడ్డి జిల్లాలోని పాలమాకులలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అలాగే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరంలోనూ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మరో గంటలో పోలింగ్ సరళి వెల్లడి కానుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయ నాయకులు అలర్టయ్యారు. ఇక, తెలంగాణ వ్యాప్తంగా అందరూ టీవీలకు అతుక్కుపోయారు. కాగా, ఎన్నికల అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు.

Telangana
Madhya Pradesh
Rajasthan
Chhattisgarh
Mizoram
counting
  • Loading...

More Telugu News