KCR: సంబురాలకు సిద్ధంకండి: శ్రేణులకు కేసీఆర్ పిలుపు!

  • ఫలితాలు వెలువడిన వెంటనే పండగ
  • మొత్తం ఫలితాలు వచ్చేస్తే రేపే ప్రమాణస్వీకారం
  • ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారన్న కేసీఆర్

తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారన్న విషయం మరికొన్ని గంటల్లో తేలిపోతుందని, పార్టీ శ్రేణులంతా సంబురాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఫలితాలు వెలువడిన వెంటనే పండగ చేసుకునేందుకు రెడీగా ఉండాలని కార్యకర్తలు, అభ్యర్థులకు ఆయన సూచించారు. ఫలితాలు వెలువడగానే, ఆపై జరగాల్సిన ప్రక్రియపై ప్రగతి భవన్‌ లో సన్నిహితులతో చర్చించిన ఆయన, ఈనెల 12న పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

ఇదే సమావేశంలో కేసీఆర్ ను లెజిస్లేచర్ నేతగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. ఆపై ప్రమాణ స్వీకారం ఎప్పుడన్న విషయంపైనా కేసీఆర్ తన సహచరులతో చర్చించినట్టు తెలుస్తోంది. 11న పూర్తి ఫలితాలు వెల్లడై, రాత్రికల్లా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైతే, 12న ప్రమాణ స్వీకారం చేయాలనే ప్రతిపాదనను చేశారు కొందరు నేతలు. ఒకవేళ పూర్తిస్థాయి మెజారిటీ రాకున్నా, హంగ్ ఏర్పడినా, అన్ని విధాలుగా సన్నద్ధమైన తరువాత ప్రమాణ స్వీకారం చేయాలన్న భావన నేతల నుంచి వ్యక్తమైంది.

KCR
Telangana
Telangana Election 2018
Telangana Assembly Election
Telangana Assembly Results
  • Loading...

More Telugu News