Srikakulam District: వెలమ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం: వైఎస్ జగన్ హామీ

  • శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్ర
  • జగన్ ను కలిసిన వెలమ సంఘాల ప్రతినిధులు
  • వినతులపై సానుకూల స్పందన

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలమ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఆయన పాదయాత్ర సాగుతుండగా, వెలమ సంఘాల ప్రతినిధులు జగన్ ను కలిశారు. జాతీయ వెలమ యూత్‌, బీసీ వెలమ సంక్షేమ సంఘం, వెలమ కార్పొరేషన్‌ జేఏసీ ప్రతినిధులు జగన్ ను కలిశారు.

వెలమలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని గుర్తు చేసిన వారు, అభివృద్ధికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, తమ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అసెంబ్లీ, పార్లమెంటు సీట్లివ్వాలని కోరారు. ప్రతి జిల్లాలో వెలమ సంక్షేమ భవనాలను నిర్మించి, హాస్టల్‌ వసతి కల్పించి, విద్యార్థులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. వారి వినతులపై జగన్ సానుకూలంగా స్పందించారు. హామీలన్నీ నెరవేర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. కాగా, నిన్న జగన్ పాదయాత్ర శ్రీకాకుళం నియోజకవర్గం దాటి ఆముదాలవలసలోకి ప్రవేశించింది.

Srikakulam District
Amudalavalasa
Jagan
Padayatra
Velama
  • Loading...

More Telugu News