Mahakutami: బీజేపీకి వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటున్న మహాకూటమి.. భేటీలో 25 పార్టీల నేతలు

  • ఢిల్లీలో సమావేశమైన విపక్ష నేతలు
  • ఎస్పీ, బీఎస్పీ గైర్హాజరు   
  • మోదీ హటావో.. దేశ్ బచావో నినాదంతో ప్రజల్లోకి
  • రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ముందుకు సాగాలని నిర్ణయం

జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటున్న మహాకూటమి నేతలు సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. 25 పార్టీల నేతలు పాల్గొని ఉమ్మడి ప్రణాళికపై 2 గంటలపాటు చర్చించారు. ప్రాంతీయ వైరుధ్యాలను పక్కనపెట్టి దేశ హితం కోసం ఒక్కటి కావాలని నేతలు నిర్ణయించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత  పరస్పరం చర్చించుకుంటూ ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు.

యూపీలో ఎస్పీ-బీఎస్పీ, కేరళలో కాంగ్రెస్-సీపీఎం, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్-సీపీఎంలు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి. అయినప్పటికీ జాతీయ స్థాయిలో వైరాన్ని పక్కనపెట్టి కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వంపై పార్లమెంటు బయట, లోపల ఆందోళనలు ఉద్ధృతం చేయాలని కూటమి నేతలు తీర్మానించారు. ‘మోదీ హటావో.. దేశ్ బచావో’నినాదంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి వెళ్లాలని కూటమి నేతలు నిర్ణయించారు. అయితే, యూపీలో ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీలు ఈ సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం!   

  • Loading...

More Telugu News