mp: ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి జూనియర్ రేవంత్ రెడ్డిగా మారారు: బాల్క సుమన్ ధ్వజం

  • తెలంగాణకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారు
  • ఈ వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబునాయుడే
  • ఆయన డైరెక్షన్ లోనే ఇదంతా నడుస్తోంది

టీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేరాలంటూ ఆ పార్టీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ చేశారన్న ఆరోపణలపై ఎంపీ బాల్క సుమన్ స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశ్వేశ్వర్ రెడ్డి జూనియర్ రేవంత్ రెడ్డిగా మారారంటూ విమర్శించారు. ఇటీవలే టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన నీతివంతమైన చరిత్ర ఏంటో అందరికీ అర్థమైందని అన్నారు.

ఈ రోజున చంద్రబాబు పంచన చేరి, రాహుల్, బాబుల మెప్పు కోసం తెలంగాణ సమాజానికి నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజమంతా కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని వాళ్లు తీర్పు ఇవ్వనున్న తరుణంలో, తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురి చేస్తారా? అని దుయ్యబట్టారు. ఈ వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబునాయుడేనని, ఆయన డైరెక్షన్ లోనే ఇదంతా నడుస్తోందని ఆరోపించారు.

mp
visveswar reddy
balka suman
Revanth Reddy
  • Loading...

More Telugu News