RBI Governer: ఆర్బీఐ గవర్నర్ రాజీనామాపై స్పందించిన చంద్రబాబు

  • ఊర్జిత్ రాజీనామా దురదృష్టకరం
  • ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది
  • ఆర్బీఐ, సీబీఐ ప్రతిష్ఠ మసకబారింది

ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్‌ రాజీనామా వ్యవహారం దేశంలో ఒక్కసారిగా కలకలం రేపింది. నేడు ఆయన తన రాజీనామా లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. దీనిపై ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.

ఊర్జిత్ రాజీనామా దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఎన్నడూ లేనంతగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం విధ్వంసకర విధానాలతోనే ఆర్బీఐ, సీబీఐ ప్రతిష్ఠ మసకబారిందన్నారు. రాజ్యాంగ సంస్థల గౌరవ ప్రతిష్ఠలని సైతం దిగజార్చిందని చంద్రబాబు మండిపడ్డారు.

RBI Governer
Urgith Patel
Chandrababu
Delhi
CBI
RBI
  • Loading...

More Telugu News