Chiranjeevi: చిరు కోసం పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసిన కొరటాల!

  • సందేశాన్ని వీడని కొరటాల
  • ‘ఠాగూర్’ తరహా కథ
  • నిర్మాతగా రామ్ చరణ్

ఫ్లాప్ అనేదే ఎరుగని దర్శకుడు కొరటాల శివ. తను ఎంచుకున్న కథలో కొత్తదనంతో పాటు సందేశాన్ని జోడించి క్లాస్.. మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులనూ ఆకట్టుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. మహేష్‌తో ‘భరత్ అనే నేను’ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయనున్నట్టు ఇప్పటికే స్పష్టం చేశారు. మరి చిరు కోసం కొరటాల ఎలాంటి కథను సిద్ధం చేశారనే దానిపైనే ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది.

అయితే చిరుతో తెరకెక్కించబోయే చిత్రంలోనూ కొరటాల సందేశాన్ని వీడలేదని తెలుస్తోంది. గతంలో మెగాస్టార్.. ‘ఠాగూర్’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం కొరటాల కూడా ఇదే తరహా పవర్‌ఫుల్ కథాంశాన్ని ఎంచుకున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని కూడా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ తెరకెక్కించనున్నారని సమాచారం. ప్రస్తుతం చిరు నటిస్తున్న ‘సైరా’ చిత్రం మార్చి నెలాఖరుకి చిత్రీకరణ పూర్తవుతుందని.. అనంతరం చిరు, కొరటాల చిత్రం సెట్స్‌పైకి వస్తుందని సమాచారం.

Chiranjeevi
Koratala Siva
Bharath Ane Nenu
Tagore
Mahesh Babu
Ramcharan
  • Loading...

More Telugu News