Telangana: రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం: రజత్ కుమార్

  • రాష్ట్ర వ్యాప్తంగా 43 లెక్కింపు కేంద్రాలు 
  • హైదరాబాద్ లో 13, ఇతర జిల్లాల్లో ఒక్కొక్కటి  
  • ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు

అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నట్టు తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 43 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశామని, హైదరాబాద్ లో 13, ఇతర జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున లెక్కింపు కేంద్రాలు ఉన్నాయని, ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారని చెప్పారు. మొత్తంగా 2379 రౌండ్లలో లెక్కింపు ఉంటుందని, ప్రతిరౌండ్ లో 14 వేల ఓట్ల వరకు ఫలితాలు వస్తాయని అన్నారు. 44,258 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చామని, పోస్టల్ బ్యాలెట్లు అన్నింటినీ చేరవేస్తామని తపాలా అధికారులు చెప్పారని అన్నారు.

Telangana
elections
counting
rajatkumar
  • Loading...

More Telugu News