raviteja: విలన్ గా రవితేజతో తలపడనున్న మాధవన్

  • వీఐ ఆనంద్ నుంచి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 
  • నిర్మాతగా రామ్ తాళ్లూరి 
  • వచ్చేనెలలో సెట్స్ పైకి  

తెలుగు .. తమిళ భాషల్లో మాధవన్ కి మంచి ఫాలోయింగ్ వుంది. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించడంలో ఆయన ఎప్పుడూ ఉత్సాహాన్ని చూపిస్తూనే వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన విలన్ పాత్రలు చేయడానికి కూడా సై అంటున్నారు. ఇటీవల వచ్చిన 'సవ్యసాచి' సినిమాలో ప్రతినాయకుడిగా ఆయన నటించారు. ఈ సినిమాకి సక్సెస్ లభించకపోవడంతో, ఆయన పాత్రకి రావలసినంత గుర్తింపు రాలేదు.

అయినా నిరాశ పడకుండా ఆయన మరోమారు విలన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. రవితేజతో దర్శకుడు వీఐ ఆనంద్ చేయనున్న సినిమాలో విలన్ పాత్ర కోసం మాధవన్ ను సంప్రదించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.  

raviteja
madhavan
  • Loading...

More Telugu News