delhi: ఢిల్లీలో భేటీ అయిన 14 పార్టీల అధినేతలు
- పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్ లో సమావేశం
- ఒకే వేదికపై కాంగ్రెస్, ఆప్
- భవిష్యత్ కార్యాచరణపై చర్చ
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందే ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్ లో 14 పార్టీల అధినేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేడీఎస్ అధినేత దేవెగౌడ, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్, సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఎం నేత సీతారాం ఏచూరిలు హాజరయ్యారు. మహాకూటమి భవిష్యత్ కార్యాచరణపై వీరు చర్చిస్తున్నారు.