bellamkonda: నిజానికి 'కవచం' కల్యాణ్ రామ్ చేయవలసిందట!

- మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'కవచం'
- పోలీస్ ఆఫీసర్ గా బెల్లంకొండ శ్రీనివాస్
- ఆసక్తి చూపని కల్యాణ్ రామ్
బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రంగా 'కవచం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ .. మెహ్రీన్ కథానాయికలుగా నటించారు. తన మార్క్ మాస్ యాక్షన్ .. కాజల్ - మెహ్రీన్ గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని బెల్లంకొండ శ్రీనివాస్ భావించాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందని ఆశించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందకపోవడం ఆయనను నిరాశపరిచిందని అంటున్నారు.
