cogress: కాంగ్రెస్ పై వ్యతిరేకత వద్దు.. అందరం కలుద్దాం: కేజ్రీవాల్ కు స్టాలిన్ విన్నపం
- దేశానికి కూటమి ఏర్పాటు అవసరం
- మహాకూటమిలో మీ వంతు పాత్రను పోషించండి
- కేజ్రీవాల్ తో భేటీ అయిన స్టాలిన్, కనిమొళి
యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలతో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి నిన్న భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై వీరు లోతుగా చర్చించారు. ఈ క్రమంలో ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను స్టాలిన్, కనిమొళి కలిశారు. దాదాపు 30 నిమిషాల సేపు వీరంతా చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకభావాన్ని వీడాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ను స్టాలిన్ కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు దేశానికి అవసరమని... కూటమిలో మీ వంతు పాత్రను పోషించాలని విన్నవించారు.