Tollywood: ఒక్కరాత్రి కోసం నిర్మాతలు ఎవరూ కోట్లు ఖర్చుపెట్టరు.. క్యాస్టింగ్ కౌచ్ పై ఖుష్బూ షాకింగ్ వ్యాఖ్యలు!

  • అన్ని రంగాల్లో లైంగిక వేధింపులు ఉన్నాయి
  • సినీ పరిశ్రమలో మాత్రం హైలైట్ అవుతున్నాయి
  • అసభ్యంగా తాకినందుకు ఒకరి చెంపలు పగులగొట్టా

కేవలం సినీ పరిశ్రమలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ భూతం ఉందని కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ అన్నారు. అయితే సినీ పరిశ్రమ కాబట్టి తక్షణం పబ్లిసిటీ దొరుకుతోందని వ్యాఖ్యానించారు. తాను 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సినిమాల్లోకి వచ్చాననీ, తెలుగు,తమిళం, హిందీ సహా పలు భాషల్లో నటించానని ఖుష్బూ వెల్లడించారు. తనకు ఎన్నడూ లైంగిక వేధింపులు ఎదురుకాలేదని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.

‘కలియుగ పాండవులు’ సినిమా షూటింగ్ సమయంలో ఓ హాస్టల్ లో తాను మెట్లు ఎక్కి వెళుతుండగా ఒకడు అసభ్యంగా తాకాడని ఖుష్బూ గుర్తుచేసుకున్నారు. వెంటనే అతని కాలర్ పట్టుకుని రెండు చెంపలు పగులగొట్టానని తెలిపారు. అప్పుడు తమ షూటింగ్ జరుగుతున్న గ్రామ ప్రజలు, హీరో వెంకటేశ్, ప్రొడ్యూసర్ సురేశ్ బాబు, టెక్నీషియన్స్ .. అందరూ తనకు అండగా నిలబడ్డారని వెల్లడించారు. లైంగిక వేధింపులకు గురికాకుండా తనకు అలాంటి ప్లాట్ ఫామ్ దొరికిందని చెప్పారు. సాధారణంగా నిర్మాతలు ఎవరూ ఒక్కరాత్రి కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టరని ఖుష్బూ కరాఖండిగా చెప్పారు. సినిమాలు తీసే ఆలోచన లేని వ్యక్తులే అలాంటి పనులు చేస్తారని స్పష్టం చేశారు.

Tollywood
Casting Couch
Congress
kushboo
producers
shocking
rs.cores
spend
never spend
Talking Movies
  • Loading...

More Telugu News