pragathi bhavan: ప్రగతిభవన్ లోకి బుల్లెట్ పై వెళ్లిన అసదుద్దీన్!

  • సీఎం కేసీఆర్ ని కలిసిన అసదుద్దీన్
  • హెల్మెట్ ధరించి బైక్ పై వెళ్లిన ఎంఐఎం అధినేత
  • కేసీఆర్ తో కొనసాగుతున్న సమావేశం

సీఎం కేసీఆర్ ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కొద్ది సేపటి క్రితం కలిసిన విషయం తెలిసిందే. ప్రగతిభవన్ లో కేసీఆర్ ని కలిసేందుకు అసదుద్దీన్ తన బుల్లెట్ పై వెళ్లడం ఆసక్తికరం. అసదుద్దీన్ కోసం మీడియా ఎదురుచూస్తున్న తరుణంలో హెల్మెట్ ధరించిన ఆయన బుల్లెట్ పై ప్రగతిభవన్ లోకి దూసుకెళ్లారు. అసదుద్దీన్ ఒక్కరే తన వాహనంపై ప్రగతిభవన్ లోకి వెళ్లడం గమనార్హం. కాగా, కేసీఆర్ తో అసదుద్దీన్ సమావేశం కొనసాగుతోంది. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుందని, టీఆర్ఎస్ కు తమ పార్టీ మద్దతు ఉంటుందని అసదుద్దీన్ పేర్కొనడం తెలిసిందే.

pragathi bhavan
kcr
asaduddin
bullet
  • Loading...

More Telugu News