entertain ment: వెంకటేశ్, నాగార్జున.. వీళ్లిద్దరూ లేకుంటే నాకు ఇంగ్లిష్ వచ్చేదే కాదు!: నటి ఖుష్బూ

  • నేను చదువుకుంది 9వ క్లాసే
  • నా తొలి సినిమా వెంకటేశ్ తో చేశా
  • ఓ పుస్తకాన్ని నాగ్ గిఫ్ట్ గా ఇచ్చారు

తాను పాఠశాలకు వెళ్లి 9వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడగలనని ప్రముఖ నటి, రాజకీయ నేత ఖుష్బూ తెలిపారు. ఇందుకు విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగార్జునకు థ్యాంక్స్ చెప్పుకోవాలన్నారు. తాను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తల్లో వెంకటేశ్, నాగార్జున అమెరికా నుంచి వచ్చారని గుర్తుచేసుకున్నారు. తాను తొలి సినిమాలో వెంకటేశ్ తో, రెండో సినిమాలో నాగార్జునతో నటించానని గుర్తుచేసుకున్నారు. వీరిద్దరూ తనతో అసలు తెలుగులోనే మాట్లాడేవారు కాదనీ, ఇంగ్లిష్ లో మాట్లాడాల్సిందిగా చెప్పేవారని వెల్లడించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడారు.

తనకు ఇంగ్లిష్ రాకపోయినా మాట్లాడాల్సిందిగా ప్రోత్సహించేవారనీ, నాగార్జున అయితే ఓ ఇంగ్లిష్ పుస్తకం కూడా కొని ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. ఎక్కువగా ఇంగ్లిష్ నవలలు చదవాల్సిందిగా తనకు నాగ్ సూచించారనీ, అలా చేయడంతో ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడగలుగుతున్నానని చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికే 8 సంవత్సరాలు గడిచిపోయాయని ఖుష్బూ తెలిపారు. 1986లో తాను సినిమాల్లోకి వచ్చానని, గత 32 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నానని పేర్కొన్నారు.

entertain ment
Talking Movies
Nagarjuna
venkatesh
Tollywood
kushboo
english
speaking
helped
  • Loading...

More Telugu News