hazrat nizamuddin dargah: హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలోకి మహిళల ప్రవేశం కేసు.. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
- దర్గాలోకి మహిళలను అనుమతించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
- అభిప్రాయాలను వెల్లడించాలంటూ హైకోర్టు ఆదేశాలు
- తదుపరి విచారణ ఏప్రిల్ 11కు వాయిదా
దేశా రాజధాని ఢిల్లీలో ఉన్న హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీటితో పాటు దర్గా ట్రస్ట్ కు నోటీసిచ్చింది. దర్గాలోకి మహిళల ప్రవేశంపై వేసిన పిటిషన్ పై అభిప్రాయాలను వెల్లడించాలని నోటీసుల్లో ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. పూణెకు చెందిన ఒక న్యాయ విద్యార్థిని ఈ పిటిషన్ ను వేశారు. దర్గాలోకి మహిళల ప్రవేశంపై గైడ్ లైన్స్ ను రూపొందించేలా కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, దర్గా ట్రస్ట్ లను ఆదేశించాలని పిటిషన్ లో ఆమె కోరారు. దర్గాలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు.