divorce: విడాకులకు ఒప్పుకోని భార్య.. నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడు!

  • గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘటన
  • ఫోన్ ద్వారా విడాకులు ఇచ్చిన ప్రబుద్ధుడు
  • కేసు నమోదు చేసిన సైబర్ సెల్ పోలీసులు

జీవితాంతం తోడుగా ఉంటానని హామీ ఇచ్చిన భర్త మూడేళ్లకే ‘నువ్వంటే ఇష్టం లేదు’ అని వదిలించుకున్నాడు. విదేశాలకు పారిపోయి ఫోన్ ద్వారా విడాకులు ఇచ్చాడు. అయినా బాధితురాలు తన కాపురాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించడంతో ఆమె పరువు తీయడానికి గతంలో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మాదాబాద్ లో చోటుచేసుకుంది.

గుజరాత్ కు చెందిన ఓ యువతికి అస్ట్రేలియాలో ఉంటున్న భారతీయ యువకుడితో 2015లో వివాహం అయింది. పెళ్లి అయిన కొత్తల్లో అంతా బాగానే ఉన్నప్పటికీ కొంతకాలం తర్వాత వీరిమధ్య గొడవలు వచ్చాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు వెళ్లిన భర్త.. ఫోన్ లోనే బాధితురాలికి విడాకులు ఇస్తున్నట్లు తెలిపాడు. దీంతో దిగ్భ్రాంతికి లోనైన యువతి న్యాయపోరాటానికి దిగింది.

అయితే భార్యను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన సదరు యువకుడు గతంలో తామిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీటికి అభ్యంతకరమైన, అశ్లీల కామెంట్లను జోడించాడు. వీటిని గమనించిన యువతి వెంటనే అహ్మదాబాద్ సైబర్ సెల్ పోలీసులను ఆశ్రయించింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

divorce
husband
Social Media
nude pics
Police
cyber cell
case
shared
wife
complaint
Gujarat
ahmadabad
  • Loading...

More Telugu News