mohanlal: తండ్రి దర్శకత్వంలో తొలిసారిగా కల్యాణి ప్రియదర్శన్

  • మోహన్ లాల్ తో ప్రియదర్శన్ 
  • భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న మూవీ 
  • వచ్చే ఏడాదిలో విడుదల          

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కల్యాణి ప్రియదర్శన్.. 'హలో' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైంది. ఆ సినిమా ఆశించినస్థాయిలో ఆడకపోవడంతో, ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వెంటనే అవకాశాలు రాలేదు. ఇక ఇప్పుడిప్పుడే ఒక్కో అవకాశాన్ని ఆమె దక్కించుకుంటూ వెళుతోంది. తెలుగులో సాయిధరమ్ తేజ్ జోడీగా ఒక సినిమా .. మలయాళంలో రెండు సినిమాలు చేస్తోంది.

మోహన్ లాల్ ప్రధాన పాత్రను పోషిస్తోన్న ఒక సినిమాలో అర్జున్ .. కీర్తి సురేశ్ కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను కల్యాణి ప్రియదర్శన్ చేస్తోంది. తండ్రి దర్శకత్వంలో ఆమె తొలిసారిగా చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమా షూటింగులో కల్యాణి ప్రియదర్శన్ జాయిన్ అయింది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

mohanlal
arjun
keerthi suresh
  • Loading...

More Telugu News