Chandrababu: ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు.. ఈ మధ్యాహ్నం కీలక సమావేశం

  • గన్నవరం నుంచి ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు
  • మధ్యాహ్నం 3.30 గంటలకు బీజేపీయేతర పక్షాల సమావేశం
  • మహాకూటమి భవిష్యత్ కార్యాచరణపై చర్చ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బయల్దేరారు. ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీలో బీజేపీయేతర పక్షాల సమావేశం జరగనుంది. మహాకూటమి భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఈ భేటీకి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎస్పీ అధినేత అఖిలేష్ సింగ్ యాదవ్, ఎస్పీ సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్, సీఐపీ నేత సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఎం నేత సీతారాం ఏచూరి, డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు హాజరుకానున్నారు.  

Chandrababu
delhi
maha ghatbandhan
  • Loading...

More Telugu News