Rohit Sharma: ఫీల్డింగ్ చేస్తూ జారిపడిన రోహిత్ శర్మ... వెన్ను భాగంలో గాయం!

  • నొప్పితో విలవిల్లాడిన రోహిత్ 
  • చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
  • మరో ఆటగాడికి అవకాశం?

ఆడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ గాయపడటం తీవ్ర కలకలం రేపింది. రెండో ఇన్నింగ్స్‌ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న వేళ, లాంగాన్ లో ఉన్న రోహిత్, పరిగెత్తుతూ జారిపడ్డాడు. దీంతో అతని వెన్ను భాగంలో గాయమైంది. రోహిత్ శర్మ నొప్పితో విలవిల్లాడిపోయాడు. దీంతో రోహిత్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రోహిత్ ప్రస్తుత పరిస్థితిపై ఇంకా పూర్తి సమాచారం అందలేదు. గాయం తీవ్రమైనదైతే, అతని స్థానంలో మరొకరిని జట్టులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది.  

Rohit Sharma
India
Australia
Cricket
  • Loading...

More Telugu News