Lagadapati Rajagopal: జీవన్‌రెడ్డికి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పిన లగడపాటి.. మీరే గెలవబోతున్నారన్న ఆంధ్రా ఆక్టోపస్

  • ప్రజాఫ్రంట్‌దే అధికారమని పునరుద్ఘాటన
  • జీవన్‌ను మంత్రి పదవి వరించబోతోందన్న లగడపాటి
  • లగడపాటి ఫోన్‌తో కార్యకర్తల జోష్

తెలంగాణలో ప్రజాకూటమిదే విజయమని ఇది వరకే చెప్పిన లగడపాటి మరోమారు ఆ విషయాన్ని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత, జగిత్యాల నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన లగడపాటి అభినందించారు. ఈ ఎన్నికల్లో మీరు గెలవబోతున్నారని చెప్పారు. మంత్రి పదవి కూడా దక్కించుకుంటారని చెప్పడంతో ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు కాసేపు ప్రస్తుత పరిస్థితులపై చర్చించుకున్నారు.

లగడపాటి తనకు ఫోన్ చేసి చెప్పిన విషయాన్ని జీవన్ రెడ్డి కార్యకర్తలకు చెప్పడంతో వారు ఆనందంతో చిందులేశారు. నిజానికి జగిత్యాలలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని గత రెండు రోజులుగా జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు లగడపాటి ఫోన్ చేసి గెలుపు జీవన్‌దేనని చెప్పడం చర్చనీయాంశమైంది.

Lagadapati Rajagopal
Jeevan Reddy
Congress
Telangana
  • Loading...

More Telugu News