Andhra Pradesh: విజయవాడలో నోవాటెల్.. ప్రారంభించిన చంద్రబాబు

  • రూ.150 కోట్ల వ్యయంతో నిర్మాణం
  • 227 గదులు, నాలుగు రెస్టారెంట్లు
  • ప్రశంసించిన చంద్రబాబు

విజయవాడలోని భారతీనగర్‌లో రూ. 150 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఫైవ్‌స్టార్ హోటల్ నోవాటెల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించారు. సకల సౌకర్యాలు కలిగిన ఈ హోటల్‌లో మొత్తం 227 గదులున్నాయి. 4 రెస్టారెంట్లు, పది వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సమావేశ మందిరాలున్నాయి.

హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎంకు వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్, సీఈవో మాధవ్, జీఎం మధుపాల్ ఘన స్వాగతం పలికారు. అనంతరం హోటల్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హోటల్ యాజమాన్యాన్ని ప్రశంసించారు. సౌర విద్యుత్, ఎల్‌ఈడీ బల్బులు, 200 మీటర్ల వాకింగ్ ట్రాక్, జిమ్, స్పా, ధ్యాన మందిరం, యోగా, వై-ఫై సౌకర్యాలు కూడా ఉన్నట్టు హోటల్ యాజమాన్యం చంద్రబాబుకి వివరించింది.  

Andhra Pradesh
Vijayawada
Novatel
Chandrababu
  • Loading...

More Telugu News