Telangana: కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి: రజత్ కుమార్

  • ఈ నెల 11న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
  • సీసీటీవీల ద్వారా లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తాం
  • స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశాం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 11న జరగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపునకు సంబంధించిన సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారులు శిక్షణ ఇచ్చారని చెప్పారు. నిరంతరం సీసీటీవీల ద్వారా లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని రజత్ కుమార్ తెలిపారు.

Telangana
elections
counting
rajatkumar
  • Loading...

More Telugu News