Vanitha: నటి వనిత అరెస్ట్.. జామీనుపై విడుదల

  • తండ్రి బంగ్లాను ఖాళీ చేయని వనిత
  • ఇంటి నుంచి పంపించేసిన పోలీసులు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన నటి

ఇటీవల కన్నతండ్రిపైనే పోరాటం మొదలు పెట్టిన నటి వనితను పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం జామీనుపై విడుదల చేశారు. చెన్నై మదురవాయల్‌ సమీపంలో ఆలపాక్కం అష్టలక్ష్మినగర్‌లో ఉన్న విజయకుమార్‌ సొంత బంగ్లాను వనిత గతంలో షూటింగ్‌ నిమిత్తం అద్దెకి తీసుకొని ఖాళీ చేయలేదు. పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను ఇంటి నుంచి పంపించారు.

దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన వనితకు భద్రత కల్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే తనకు ఇంట్లోకి వెళ్లేందుకు సుప్రీం అనుమతిచ్చిందంటూ న్యాయవాదులతో గురువారం బంగ్లాలోనికి వెళ్లారు. దీంతో విజయకుమార్‌ మళ్లీ మదురవాయల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేసి.. అనంతరం జామీనుపై వదిలిపెట్టారు.

Vanitha
Vijay kumar
Chennai
Supreme Court
Police
  • Loading...

More Telugu News