TRS: టీఆర్ఎస్ కు చెందిన వాళ్లే ‘కాంగ్రెస్’కు ఓటేయమని చెప్పారు!: పొన్నం ప్రభాకర్

  • కరీంనగర్ లో ‘కాంగ్రెస్’ ఘన విజయం సాధిస్తుంది
  • గంగుల కమలాకర్ ఓ గ్యాంబ్లర్
  • అవినీతిపరుడైన గంగుల ఓటర్లను ప్రలోభపెట్టారు

కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని టీ-కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ కు చెందిన మేయర్, కార్పొరేటర్లే తమ పార్టీకి ఓటేయాలని ప్రజలకు చెప్పారంటూ వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఓ గ్యాంబ్లర్ అని, ఆర్నెల్లకోసారి, సింగపూర్, మలేషియా దేశాలకు వెళ్లొస్తుంటారని, అవినీతిపరుడైన గంగుల ఓటర్లను ప్రలోభపెట్టారని ఆరోపించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తారన్న అనుమానం ఉందని, గజ్వేల్ లా తెలంగాణ అంతటా వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఈసీని కోరతామని చెప్పారు. వంద సీట్లు వస్తాయని చెబుతున్న టీఆర్ఎస్ కు కనీసం పది సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.

TRS
ponnam prabahkar
congress
karimnagar
  • Loading...

More Telugu News