allahabad university: మరో పేరు మార్పుకు సిద్ధమైన యోగి సర్కార్

  • ప్రయాగ్ రాజ్ యూనివర్శిటీగా మార్చాలని నిర్ణయం
  • ఆమోదముద్ర కోసం గవర్నర్ కార్యాలయానికి చేరిన ఫైల్
  • ముజఫర్ నగర్ జిల్లా పేరును లక్ష్మీనగర్ గా మార్చాలంటున్న సంగీత్ సోమ్

అలహాబాద్, ఫైజాబాద్ జిల్లాల పేర్లను మార్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే మరో పేరు మార్పుకు యోగి ఆదిత్యనాథ్ సర్కారు సిద్ధమైంది. అహ్మదాబాద్ యూనివర్శిటీ పేరును ప్రయాగ్ రాజ్ యూనివర్శిటీగా మార్చాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రపోజల్ ను రాష్ట్ర గవర్నర్ కార్యాలయానికి పంపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అలహాబాద్ యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ దీనికి సంబంధించిన ప్రపోజల్ ను గవర్నర్ ఆమోదముద్ర కోసం ఆయన కార్యాలయానికి పంపారు.

దీనిపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ స్పందిస్తూ... అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చినప్పుడు, అలహాబాద్ యూనివర్శిటీ పేరును కూడా మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. యూనివర్శిటీతో పాటు ఇంటర్మీడియట్, హైస్కూల్ బోర్డుల పేర్లను కూడా మార్చాలనే డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. మరోవైపు, ముజఫర్ నగర్ జిల్లా పేరును కూడా లక్ష్మీనగర్ గా మార్చాలని బీజేపీ నేత సంగీత్ సోమ్ డిమాండ్ చేస్తున్నారు. 

allahabad university
payagraj university
yogi adityanath
  • Loading...

More Telugu News