kcr: కేసీఆర్ కు రెండు చోట్ల ఓటు హక్కు ఉంది.. ఈసీకి ఫిర్యాదు చేస్తాం: రేవంత్ రెడ్డి

  • ఎర్రవల్లి, చింతమడక గ్రామాల్లో కేసీఆర్ కు ఓటు హక్కు 
  • రెండు ప్రాంతాల్లో ఎలా నమోదు చేసుకుంటారు?
  • కేసీఆర్ తప్పిదానికి ఏడాది జైలు శిక్ష పడుతుంది

తెలంగాణలోని రెండు ప్రాంతాల్లో కేసీఆర్ కు ఓటు హక్కు ఉందని.. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియతో మాట్లాడుతూ, ఎర్రవల్లి, చింతమడక గ్రామాల్లో కేసీఆర్ ఓటు హక్కు నమోదు చేసుకున్నారని, రెండు ప్రాంతాల్లో ఆయన ఎలా నమోదు చేసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, కేసీఆర్ తప్పిదానికి ఏడాది వరకు జైలు శిక్ష పడుతుందని అన్నారు.

kcr
Revanth Reddy
erravalli
chintamadaka
  • Loading...

More Telugu News