Bengalore: మందలించిన అమ్మపైనే దాడి చేసిన బాలుడు.. కేసు నమోదు!

  • మద్యానికి అలవాటు పడిన బాలుడు
  • వీడియో తీసిన బాలుడి అక్క
  • విచారణ చేపట్టిన మహిళా కమిషన్

దురలవాట్లకు అలవాటుపడిన కుమారుడిని దారిలో పెట్టేందుకు యత్నించిన తల్లిపైనే ఆ కొడుకు దాడి చేసిన ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఓ బాలుడు మద్యం, సిగిరెట్ తాగడం వంటి దురలవాట్లకు బానిసయ్యాడు. అల్లరి చిల్లరిగా నడుచుకుంటున్న కుమారుడిని చూసి తట్టుకోలేకపోయిన ఆ తల్లి మందలించింది.  

తన గురించి ఇరుగుపొరుగు వారికి చెడుగా చెబుతోందంటూ తల్లిపైనే దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనంతా బాలుడి అక్క వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీడియోను చూసిన అన్నామలై పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు చెన్నమ్మనకేరే అచుకట్టు పోలీసులు బాలుడిపై కేసు నమోదు చేశారు. ఘటనపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ కూడా విచారణ ప్రారంభించింది.

Bengalore
Karnataka
Women commission
Deputy commissioner
Police
  • Loading...

More Telugu News