Andhra Pradesh: రేపు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు.. కేంద్రంపై పోరాడేందుకు ఎంపీలకు దిశానిర్దేశం!

  • ఏపీ భవన్ లో రేపు టీడీపీ పార్లమెంటరీ సమావేశం
  • హోదా, విభజన హామీలపై పోరాటానికి టీడీపీ స్కెచ్
  • జాతీయ నేతలతో సమావేశం కానున్న చంద్రబాబు

బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఎల్లుండి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వీలుగా చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

రేపు ఉదయం ఏపీ భవన్ లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఏపీకి తిత్లీ తుపాను సాయం, విభజన హామీలు, ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని ఎండగడుతూ ఎలా పోరాడాలో పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, జేడీఎస్ నేత దేవెగౌడ, శరద్ యాదవ్ సహా పలువురు నేతలతో బాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

Andhra Pradesh
Telangana
Chandrababu
parliamentary meet
Sachin Tendulkar
Special Category Status
ap bhavan
  • Loading...

More Telugu News