Andhra Pradesh: టీడీపీ నేత ‘మాగుంట’ కంపెనీలపై కొనసాగుతున్న ఐటీ దాడులు!

  • మూడో రోజూ కొనసాగుతున్న తనిఖీలు
  • రూ.55 కోట్ల నగదు, బంగారం స్వాధీనం
  • హార్డ్ డ్రైవ్, కీలక డాక్యుమెంట్లు జప్తు

టీడీపీ ఎమ్మెల్సీ, పార్లమెంటు మాజీ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై మూడో రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పొందిన ఆదాయం, సమర్పించిన ఐటీ రిటర్నుల మధ్య వ్యత్యాసం ఉండటంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా చెన్నైలోని ‘మాగుంట బాలాజీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్’ కార్యాలయాలు, శ్రీనివాసులు రెడ్డి ఇళ్లలో నిర్వహించిన దాడుల్లో అధికారులు రూ.55 కోట్ల నగదుతో పాటు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ తనిఖీల్లో భాగంగా కంపెనీకి సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డ్రైవ్, డిస్క్ లను అధికారులు జప్తు చేశారు. తాజాగా చెన్నై టీనగర్ లోని మాగుంట గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయం, పూందమల్లిలోని ఫ్యాక్టరీ, చెన్నైలోని శ్రీనివాసులు రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

Andhra Pradesh
Telugudesam
MLC
maagunta
srinivasulu reddy
it raids
  • Loading...

More Telugu News