garikapati narasimha rao: ప్రముఖ సహస్రావధాని గరికపాటి నరసింహారావు సంచలన నిర్ణయం

  • ఇకపై ప్రవచనాలకు స్వస్తి
  • ఏప్రిల్ నుంచి టీవీ కార్యక్రమాలు, ప్రవచనాలకు దూరం
  • ఇకపై ఎక్కువ కాలం మౌనంలోనే..

తన ప్రవచనాలతో కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రవచనాలు, టీవీ కార్యక్రమాలకు స్వస్తి చెప్పబోతున్నట్టు ప్రకటించారు. రమణ మహర్షి ఆధ్యాత్మక బోధనలను ప్రేరణగా తీసుకుని ఎక్కువ సమయాన్ని మౌనంగా గడపాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తి చేయాల్సి ఉందని, లలితా సహస్రనామ పారాయణంలో ఇంకా 800 నామాలపై ప్రసంగాలు ఇవ్వాల్సి ఉందన్నారు. వీటన్నింటినీ ఏప్రిల్ నాటికి పూర్తి చేయనున్నట్టు వివరించారు.  

గరికపాటి నిర్ణయం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది. వ్యక్తిగతంగా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ సమాజానికి నాలుగు మంచిమాటలు చెప్పే వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించడం బాధాకరమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయంపై మరోమారు ఆలోచించాలని కోరుతున్నారు. కాగా, గరికపాటి కుమారుడు గురజాడ ఇకపై ప్రవచనాలు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.  

garikapati narasimha rao
Avadhani
Telugu Guru
Speeches
pravchanalu
  • Loading...

More Telugu News