Ramdas Athawale: కేంద్రమంత్రి అథవాలే చెంప చెళ్లుమనిపించిన ఆగంతుకుడు!

  • అకస్మాత్తుగా మంత్రిపై దాడి చేసిన దుండగుడు 
  • పట్టుకుని చితకబాదిన అనుచరులు
  • తీవ్ర గాయలు.. ఆసుపత్రికి తరలింపు

కేంద్రమంత్రి రాందాస్ అథవాలేకు మహారాష్ట్రలో చేదు అనుభవం ఎదురైంది. అంబర్‌నాథ్‌లో శనివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అథవాలే తిరిగి వెళ్తుండగా అనూహ్య ఘటన జరిగింది. అకస్మాత్తుగా మంత్రివైపు దూసుకొచ్చిన ఓ వ్యక్తి ఆయన చెంపను చెళ్లుమనిపించాడు. వెంటనే తేరుకున్న ఆయన అనుచరులు ఆగంతుకుడిని పట్టుకుని చితకబాదారు. నిందితుడిని ప్రవీణ్ గోసావిగా పోలీసులు గుర్తించారు.

మంత్రి అనుచరుల చేతిలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మంత్రిపై ప్రవీణ్ ఎందుకు దాడిచేశాడన్న విషయాలు తెలియరాలేదు. మంత్రిపై దాడి విషయం బయటకు పొక్కడంతో ఆయన అభిమానులు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పథకం ప్రకారమే ఆయనపై దాడి జరిగిందని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. మంత్రిపై దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు.

Ramdas Athawale
attacked
Maharashtra
Union Minister
  • Loading...

More Telugu News